కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడ్డారు. తుఫాన్ల సమయంలో అలలు భారీగా ఎగసి పడి.. ఇసుకతోపాటు బంగారం రేణువులు కొట్టుకొస్తాయని.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా చేపల కోసం మాత్రమే వేట కొనసాగించే మత్స్య కారులు ప్రస్తుతం… బంగారం కోసం వేటను ప్రారంభించారు. దీంతో ఉప్పాడ తీరానికి జనాలు క్యూ కడుతున్నారు.
Read Also: Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీపై ప్రభావం చూపింది. తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
తుఫాన్ వచ్చిందంటే కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులంతా కలిసి సముద్ర తీరానికి చేరుకుంటారు. బంగారు రేణువులు దొరుకుతాయనే ఉద్దేశ్యంతో అక్కడే వేట కొనసాగిస్తారు. తుఫాన్ల సమయంలో అలలు భారీగా ఎగసి పడి.. ఇసుకతోపాటు బంగారం రేణువులు కొట్టుకొస్తాయని స్థానికుల నమ్మకం. ఉప్పాడ సముద్ర తీరానికి క్యూ కట్టిన స్థానికులు. ఇసుకలోని మిణుకు మిణుకుమని మెరిసే బంగారు రంగు రేణువులను సేకరిస్తున్నారు. కొందరికి బంగారం రేణువులు దొరకడంతో సంబరపడిపోతున్నారు.
