Site icon NTV Telugu

Anantapur: ఎక్కడైతే హుండీ చోరీ జరిగిందే.. మళ్లీ అక్కడికే వచ్చి చేరిన దేవుడి సొమ్ము

Sam

Sam

ఎక్కడైతే దేవుడి హుండీ చోరీ జరిగింతే.. మళ్లీ అక్కడికే దేవుడి సొమ్ము వచ్చింది. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం..

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆ హుండీలోని సొమ్మును తిరిగి యధా స్థానంలో పెట్టారు. దానితో పాటు అందులో ఓ లేఖ కూడా ఉండడం విశేషం. హుండీలో ఉన్న నగదు దొంగలించడంతో తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని… ఆ లేఖలో దొంగలు తెలిపారు. అందుకే నగదును మొత్తం తెచ్చి పెడుతున్నామని లేఖలో రాశారు.

దీంతో దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. పోయిన నగదు రూ.1,86,486 ఉన్నట్లు ఆలయం సిబ్బంది తెలిపారు. ఆ అమ్మవారే తన డబ్బును తిరిగి రప్పించుకుందంటూ.. ఆలయ సిబ్బంది.. స్థానికులు చెప్పుకుంటున్నారు.

Exit mobile version