Site icon NTV Telugu

Pulasa: దొరక్క దొరక్క దొరికిన పులస.. ఎన్ని వేలు పలికిందో తెలుసా..?

Pulasa

Pulasa

పులస దొరకడం అరుదు.. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.. రుచికి పెట్టింది పేరు.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్నారంటే.. దానికి ఉన్న ప్రత్యేక ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకొని వెళ్లారట.. అయితే, రుచిలోనే కాదు.. ధరలోనూ అదుర్స్‌ అనిపిస్తూ.. మత్స్యకారులకు లాభాల పంట పండిస్తోంది పులస..

Read Also: Astrology : అక్టోబర్‌ 08, శనివారం దినఫలాలు

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు డైలీ మార్కెట్‌లో పులస ఏకంగా రూ.22 వేలు పలికింది.. ఈ సంవత్సరంలో మొదటి పులస మార్కెట్‌కు రావడంతో.. కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు పులుసు ప్రియులు… చివరకు 3 కిలోల పులస చేపను.. 22 వేల రూపాయలకు కొనుగోలు చేశారు రాజోలు కుంచెందిన బైరిశెట్టి శ్రీరాములు అనే పులస ప్రియుడు… అయితే, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు భారీ వరదలు వచ్చినా.. గోదావరిలో పులస జాడ కనిపించలేదని చెబుతున్నారు మత్స్యకారులు.. మొత్తంగా దొరక్క దొరక్క దొరికిన పులసకు వేల రూపాయలు అయినా వెచ్చించడానికి వెనుకాడడం లేదు పులస ప్రియులు.

Exit mobile version