Site icon NTV Telugu

విజయవాడలో త్వరలో జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ ల్యాబ్‌

కరోనా వైరస్‌తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్‌కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 15 శాతం నమూనాల వైరస్‌ జన్యు క్రమాన్ని గుర్తించడానికి హైద్రాబాద్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నారు.

ఒమిక్రాన్‌ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి నమూనాలను హైద్రాబాద్‌కు పంపాల్సి వస్తోంది. దీంతో ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతుంది. విజయవాడలో ల్యాబ్‌ ఏర్పాటు అయితే ఫలితాలు త్వరగా వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు వచ్చే వారంలో ల్యాబ్‌లో కార్యకలాలపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ల్యాబ్‌లోపని చేసే వైద్య సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపారు.

Exit mobile version