Site icon NTV Telugu

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై రేపే గెజిట్..

River

River

కృష్ణా, గోదావరి నదుల నిర్వహణ బోర్డులకు సంబంధించి రెండు గెజట్ నోటిఫికేషన్లను జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. రేపు మధ్యాహ్నం 1.45 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ గెజిట్ నోటిఫికేషన్లు 2014లోనే విడుదల చేయాల్సి ఉండగా, అనేక అవాంతరాలతో.. ఇప్పటికే విడుదలకు సిద్ధమయ్యాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత ముదరడంతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న రెండు నదులు.. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల పరిధుల్లోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ, పరిపాలన, నియమనిబంధనలను వివరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

Exit mobile version