ఏపీలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే చంద్రబాబుతో సమావేశానికి గంటా హాజరుకాలేదు. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని టీడీపీ కార్యాలయానికి గంటా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని గంటా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: CM Jagan: అక్షయపాత్ర ద్వారా 2 గంటల్లో 50వేల మందికి భోజనం
కాగా ఏపీలో గంటా శ్రీనివాసరావు కీలకమైన కాపు నాయకుడు. దీంతో కొంతకాలంగా ఆయన కాపునేతలతో రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీకి ఆహ్వానం అందినా ఆయన వెళ్లలేకపోయారు. తాజా పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంటాకు చంద్రబాబు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారో లేదో అన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొని ఉంది. మరోవైపు గంటా పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతుండటం గమనార్హం.
