తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, మత్తుపదార్ధాలు యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు చల్లపల్లి పోలీసులు. బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన మల్లవోలు ఆదిశేషు అతని భార్య వెంకటేశ్వరమ్మ, చల్లపల్లి కి చెందిన కోట అనిల్ కుమార్, చిలక అజయ్ అను నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, 3010 రూపాయల నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also: Domestic Flight : ఆ గ్రామంలో ఇంటికో ఫ్లైట్ ఉంటుంది
వీరు విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి గంజాయిని తీసుకువచ్చి చల్లపల్లి, రేపల్లె గ్రామాలలో ఉన్న యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నట్లు అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా తెలిపారు. ఎన్జీవోల సహాయంతో యువతకు జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించారు అధికారులు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క నడవడికపై ఆరాధిస్తూ వారి అలవాట్లపై నిఘా ఉంచుకోవాలని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా కోరారు. ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడమని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు. పిల్లల కదలికలపై, వారి మానసిక స్థితిపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు.
Read Also: Jamiat Ulama-i-Hind: భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి.. మోదీ, మోహన్ భగవత్ లాగే మాకు హక్కుంది..