NTV Telugu Site icon

Indian Economy: రెండేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌..

Indian Economy

Indian Economy

రానున్న రెండేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిబోతోంది.. నేటి యువతరంలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ పాటవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గైట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలి గ్రాడ్యుయేషన్ ఉత్సవం నిర్వహించారు.. ఈ సభకు అధ్యక్షత వహించిన గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశీ కిరణ్ వర్మ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఆవిష్కరణలు వినూత్నంగా చేస్తున్న విద్యార్థులే భావితరానికి మార్గదర్శకులని పేర్కొన్నారు.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలితో భారతదేశంలోనే తొలిసారిగా ఓపెన్ ఇన్నోవేషన్ పై గైట్ అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్.. గ్రాడ్యుయేషన్ ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రఖ్యాత సంస్థలకు చెందిన సీఈవోలు, ప్రమోటర్స్.. అయితే, అమెరికాలోని సిలికాన్ వాలిలా రాజమండ్రి కావాలన్నదే తమ ఆకాంక్ష, లక్ష్యం అని పేర్కొన్నారు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ.

Read Also: Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి