చేపల వేటకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం చాపరాజు పాలెంలో చోటుచేసు కుంది. చేపల వేట నిమిత్తం సమీపంలోని బొంతు వలస గడ్డవద్దకు వెళ్లిన గిరిజనులు ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన వారిని జీకే వీధి మండలంలోని చాప రాజు పాలెం గ్రామనికి చెందిన గడుతూరి నూకరాజు (35) గడుతూరి తులసి (9) గడుతూరి లాస్య (10) రమణబాబుగా గుర్తించారు.
ముగ్గురు మృతదేహలు లభించాయి. రమణబాబు మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో వారి కుటుం బాల్లో విషాదం అలుముకుంది. ఒకే సారి నలుగురు మృతి చెందడం తో ఆప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
