NTV Telugu Site icon

IAS officers: ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు..

Ias

Ias

IAS officers: డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ రిపోర్టు చేసేశారు. కాగా, నిన్న (బుధవారం) సాయంత్రం తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో ఈ నలుగురు అధికారులు ఏపీకి వచ్చారు.

Read Also: Miss India 2024: ‘మిస్‌ ఇండియా’గా నిఖిత పోర్వాల్‌!

మరోవైపు ఏపీ నుంచి రిలీవ్ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇప్పటికే సీఎస్ కు రిపోర్ట్ చేశారు. అయితే, ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై నవంబర్‌లో విచారణ కొనసాగనుంది. వారి అభ్యంతరాలపై తుది ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఏపీ నుంచి రిలీవ్‌ అయిన అధికారుల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ సృజనతో పాటు శివశంకర్‌, హరికిరణ్‌లు ఉన్నారు.