Site icon NTV Telugu

KCR: విద్యుత్‌ కమిషన్‌పై సుప్రీంకోర్టుకు మాజీ సీఎం..

Kcr

Kcr

విద్యుత్‌ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. ఈ క్రమంలో.. రేపు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలన్న ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. కాగా, హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేశారు.

Read Also: Carlos Alcaraz: మరోసారి వింబుల్డ‌న్ టైటిల్ ను ముద్దాడిన అల్క‌రాజ్..

కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయగా.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది కమిషన్. అయితే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ గులాబీ బాస్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. దీంతో.. కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.

Health Tips: వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. చాలా ప్రమాదం..

Exit mobile version