Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ

Ips Transfers

Ips Transfers

ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా నియమించారు. కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్‌కుమార్‌ రెడ్డిని నియమించింది. అటు విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా విశాల్ గున్నీని ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్ధార్ధ్ కౌశల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Vidadala Rajini: విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేక అభిమానం

Exit mobile version