Site icon NTV Telugu

ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం..

Delta Plus

Delta Plus

కరోనా మహమ్మారి రోజుకో వేరియంట్ రూపంలో ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.. ఇప్పటికే పలు దేశాలను డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ కేసు నమోదు అయ్యింది.. చిత్తూరు జిల్లా తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వెలుగు చూసింది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న బాధితుడు డెల్టా ప్లస్‌ వేరియంట్ బారినపడ్డాడు… ఇప్పటికే శ్యాంపిల్‌ను పుణులోని సీసీఎంబీకి అధికారులు పంపగా.. ఇవాళ అది డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. ఇక, ఏపీలో కూడా డెల్టా ప్లస్‌ కేసు నమోదు కావడంతో.. ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైంది. మరోవైపు.. ఇప్పటికే దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇలాంటి తరహా కేసులు వెలుగుచూసినట్టు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version