NTV Telugu Site icon

అవనిగడ్డలో ఇంటింటికి కనెక్షన్‌ పైప్‌ లైన్‌లో గ్యాస్‌ లీక్‌.. మంటలు..!

gas

gas

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై మంటలు చెలరేగిన ఘటన కలకలం సృష్టించింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డలో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి వేసిన పైప్ లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయ్యింది.. దీంతో.. అవనిగడ్డలోని సీతాయమ్మ హోటల్ సెంటర్ వద్ద భూమిపై మంటలు చెలరేగాయి… వెంటనే స్పందించిన గ్యాస్ సిబ్బంది.. పైప్ లైన్ రిపేర్ వర్క్ ప్రారంభించారు. ఒక్కసారిగా భూమిపై మంటలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ మంటల వలన ఒక వ్యక్తికి గాయాలు అయినట్టుగా సమాచారం అందుతుండగా… దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.