NTV Telugu Site icon

Fire Accident in Tirumala: టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం.. పలు ఫైల్స్ దగ్ధం..!

Tirumala

Tirumala

Fire Accident in Tirumala: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజినీరింగ్ దస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనపై అధికారులకు నాగార్జున అనే ఉద్యోగి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను ఆర్పివేశారు సిబ్బంది.

Read Also: Milind Deora: కాంగ్రెస్ ఎప్పటికీ ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రి చేయదు..

కాగా, అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనా? లేదా ఏమైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక, అగ్ని ప్రమాదం జరిగిన టీటీడీ పరిపాలన భవనం ఇంజనీరింగ్ సెక్షన్ ను సీవీ అండ్ ఎస్వో శ్రీధర్ పరిశీలించారు. పలు ఆలయాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి ఫైల్స్ దగ్ధమైనట్టు గుర్తించామన్నారు. ఈ ఫైలింగ్ ఉన్నందున డేటా మొత్తం సేఫ్ గా ఉంటుందని అంటున్నారు‌. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు శ్రీధర్.

Show comments