NTV Telugu Site icon

Fire Accident: ప్రకాశంలో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ మొత్తం దగ్ధం

Prakasham Fire Accident

Prakasham Fire Accident

Fire Accident In Power Office In Prakasham District: ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు – కర్నూల్ రోడ్‌లోని ఓ పవర్ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో.. చుట్టూ ఉన్న పరికరాలతో పాటు పక్కనే రూమ్‌లోకి మంటలు వ్యాపించాయి. దీంతో.. ఆఫీస్ ఆవరణలో ఉన్న పాత స్క్రాప్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు అగ్నిమాపక వాహనాలు చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు

కాగా.. గత నెలలోనూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెయింట్‌ షాప్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో.. పెయింటింగ్ మెటీరియల్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకొని, మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Sanjay Raut: మోడీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే బాలాసోర్ రైలు దుర్ఘటన

Show comments