మానవత్వం మంటగలిసిపోతుంది.. కన్న తండ్రే కొడుకుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసి నిప్పంటించాడు తండ్రి. దీంతో ఆస్పత్రి పాలైన కొడుకు చికిత్స పొందుతున్నాడు. కొడుకు ఫిర్యాదుపు తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రక్త సంబంధాలు రాక్షసత్వంగా మారుతున్నాయి, ఇందుకు నిదర్శనం గానే నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకునే కడతేర్చేందుకు ఓ తండ్రి , దుర్మార్గానికి ఒడిగట్టాడు. కొడుకు పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నొస్సం గ్రామంలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా ,ఫాతిమాభి దంపతుల కుమారుడు హుస్సేన్. బాషా, గత కొంతకాలంగా బీపీ షుగర్ వ్యాధులతో అనారోగ్యం పాలైన తండ్రి మహబూబ్ బాషా మద్యానికి పూర్తిగా బానిస అయిపోయాడు. భార్య ఫాతిమాబీతో తరచుగా గొడవపడేవాడు. గత పది రోజుల క్రితం తండ్రి తల్లిపై గొడవ పడుతూ కొడుతుండటంతో కొడుకు హుస్సేన్ బాషా అడ్డు పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహబూబ్ బాషా తల్లి కొడుకుని ఇద్దరిని ఏదో ఒక రోజు చంపేస్తానని హెచ్చరించాడు.
Read Also: BJP: టార్గెట్ 2024.. ఈ నెల 27న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల కీలక సమావేశం
దీనిని మనసులో ఉంచుకొని కోపంతో రగిలిపోతున్న మహబూబ్ బాషా .. కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు, కన్నతండ్రి దుర్మార్గపు చర్యకు పాల్పడంతో కొడుకు హుస్సేన్ బాషా , చేతులకు ముఖం పై , ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితున్ని చికిత్స నిమిత్తం కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెట్రోల్ పోసి నిప్పంటించి ఘటనకు సంబంధించి , కొడుకు హుస్సేన్ బాష ఫిర్యాదు మేరకు తండ్రి మహబూబ్ బాషా పై హత్యా యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Osmania University: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి