NTV Telugu Site icon

రూపాయికి పడిపోయిన కిలో టమోటా ధర.. రైతుల ఆందోళన..

టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రూపాయికే కిలో టమోటా అమ్మాల్సి వస్తే.. పెట్టిన పెట్టుబడి ఎలా వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అసలే పెట్టుబడి పెరిగిపోయింది.. కానీ, గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.