NTV Telugu Site icon

ఏపీ డీజీపీని వదలని సైబర్ నేరగాళ్లు…

Gautam Sawang

ఓవైపు టెక్నాల‌జీ పెరుగుతూ ఉంటే.. మ‌రోవైపు సైబ‌ర్ నేరాగాళ్లు కూడా పంజా విసురుతున్నారు.. ఆన్‌లైన్ వేదిక‌గా మోసాల‌కు తెర‌లేపుతున్నారు.. స‌మాచారాన్ని దొంగిలించి.. అందిన‌కాడికి దండుకుంటున్నారు.. మ‌రికొంద‌రి పేర్ల‌తో న‌కిలీ ఖాతాల‌ను సృష్టించి.. అవ‌స‌రం ఉందంటూ డ‌బ్బులు కూడా అడుగుతున్నారు. ఇక‌, ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు వీఐపీల‌ను సైతం వ‌ద‌ల‌డంలేదు.. పోలీసు శాఖ‌లో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న‌వారిని సైతం టార్గెట్ చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఏపీ డీజీపీని కూడా విడిచిపెట్ట‌లేదు.. ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచారు సైబర్ నేరగాళ్లు… డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫోటో పెట్టి అధికారిక ఖాతాగా ప్ర‌క‌టించారు కేటుగాళ్లు.. అంతేకాదు.. పలు ట్వీట్లు కూడా పెట్టారు.. దీంతో.. డీజీపీ ఖాతాయే అనుకొని.. పలు జిల్లాల ఎస్పీలు కూడా అనురించ‌డం మొద‌లు పెట్టారు.. ఇక‌, ఆ త‌ర్వాత దీనిని గుర్తించిన డీజీపీ కార్యాల‌యం.. వెంట‌నే ఖాతాను స్తంభింప‌జేసింది.. డీజీపీ పేరుతోనే ఫేక్ ఖాతాను ఓపెన్ చేయ‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న బెజవాడ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు న‌మోదుచేశారు.. దీని వెనుక ఎవరున్నారు, ఏ ఐపీ అడ్రస్ వాడారు అనే కోణంలో విచారణ చేప‌ట్టారు.