Site icon NTV Telugu

Fake GO: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై ఫేక్‌ జీవో కలకలం.. పోలీసులకు ఫిర్యాదు

Fake Go

Fake Go

Fake GO: సోషల్‌ మీడియా ఎంట్రీ తర్వాత రియల్‌ ఏదో.. వైరల్‌ ఏంటో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.. సున్నిత అంశాలపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టి వైరల్‌ చేయడమేకాదు.. ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు.. కొన్ని సార్లు కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా డమ్మీవి తయారు చేసి.. ఉద్యోగులను గందరగోళంలోకి నెడుతున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్‌ జీవో కలకలం రేపుతోంది.. ఫేక్ జీవోను సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. గతంలో 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ట్యాంపర్ చేసిన కేటుగాళ్లు.. ఫేక్‌ జీవోను సృష్టించారు.. అందులో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు అని పేర్కొన్నారు.

Read Also: Kodali Nani: పవన్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారు..!

అయితే, జీవోను ట్యాంపర్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఫేక్ జీవో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందోననే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.. జీవోను ట్యాంపర్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.. ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణపై కలకలం రేపుతోన్న ఫేక్ జీవోపై పోలీసుకు ఫిర్యాదు చేసింది ఆర్థిక శాఖ.. దీనిపై గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు ఆర్థిక శాఖ అధికారులు. ఇక, కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు డీఐపీ.. మొత్తంగా ఈ ఫేక్‌ జీవో.. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version