ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిదంటూ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు Fact Check అంటూ వివరణ ఇచ్చింది. విశాఖలో సభా వేదిక వద్ద సీఎం కు అవమానం అంటూ దుష్ప్రచారాలు. ప్రధాని సీఎంకు గౌరవం ఇస్తే. అవమానమంటూ తప్పుడు ప్రచారాలు. వేదిక పైకి వెళ్లేందుకు ప్రధానికి ఒక మార్గం, సీఎం, గవర్నర్లకు మరో మార్గం ఏర్పాటు. ప్రధానితో ఉన్న సీఎం, గవర్నర్ తమ మార్గం వైపుకు తిరగగా. వారిని తనతో రమ్మని ఆహ్వానించిన ప్రధాని అప్పటికే తమ మార్గం వైపునకు తిరిగిన సీఎం జగన్. ప్రధాని తనతో రమ్మంటున్నారంటూ సీఎంకు సంకేతం ఇచ్చిన ఎస్పీజీ సిబ్బంది. దీంతో ప్రధానితో కలసి వేదికపైకి వెళ్లిన సీఎం, గవర్నర్.. అంటూ వివరించింది.
Read Also: CM Jagan: అక్కడ సముద్రం.. ఇక్కడ జన సముద్రం
విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు జగన్ పాల్గొన్నారు. ప్రధాన స్టేజ్ పైన ప్రధానమంత్రి మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు మాత్రమే అవకాశం కల్పించారు. మిగిలిన నేతలకు మరో స్టేజ్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోడీ పర్యటనలో జగన్ కి అవమానం జరిగిందని, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు ప్రచారం అయ్యాయి. ఇవి వాస్తవం కాదని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది.
విశాఖలో సభా వేదిక వద్ద సీఎం కు అవమానం అంటూ దుష్ప్రచారాలు. ప్రధాని సీఎంకు గౌరవం ఇస్తే. అవమానమంటూ తప్పుడు ప్రచారాలు
వేదిక పైకి వెళ్లేందుకు ప్రధానికి ఒక మార్గం, సీఎం, గవర్నర్లకు మరో మార్గం ఏర్పాటు. 1/2 pic.twitter.com/Ma7o4OyUf4
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 12, 2022
ఇదిలా వుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం జగన్ ప్రజల ఆకాంక్షలను మోడీకి విస్నష్టంగా వివరించారు. ఈ పర్యటనలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్ శనివారం అభినందించారు. విశాఖలో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా డీజీపీ.. సీనియర్ ఐపీఎస్‌ల నేతృత్వంలో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నగర పర్యటన, రోడ్ షోకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖను సీఎం అభినందించారని డీజీపీ కార్యాలయం తెలిపింది.
Read Also: Pet Dog Menace: పెంపుడు కుక్క దాడి చేస్తే యజమానికి రూ.10 వేల జరిమానా.. ఎక్కడంటే?
