Site icon NTV Telugu

Facial Recognition Attendance: సర్కార్‌ కీలక నిర్ణయం.. అన్ని విభాగాలు, కేటగిరీల ఉద్యోగులకూ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్..

Facial Recognition Attendan

Facial Recognition Attendan

ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, అన్ని విభాగాలు, అన్ని కేటగిరీల ఉద్యోగులకు కూడా ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియట్ సిబ్బంది వరకు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోనున్నారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇదే విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ముందుగా.. సెక్రటేరియట్, హెచ్‌వోడీ, జిల్లా స్థాయి ఆఫీసుల్లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.. మిగిలిన అన్ని ఆఫీసుల్లో వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి…

Read Also: Off The Record about Yanamala Brothers: యనమల సోదరుల మధ్య టికెట్‌ రగడ..!

ఇక, సాంకేతిక సహకారం అందించటంలో నోడల్ ఏజెన్సీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం వ్యవహరించనుంది.. ఉద్యోగుల సెలవులు, ఆప్షనల్ హాలీడేలు సైతం ఆన్‌లైన్ విధానంలోనే అమలు చేయబోతున్నారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదట ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ తీసుకొచ్చింది.. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.. అయితే, మొబైల్ అప్లికేషన్‌లో కొన్ని మార్పులను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్.. అదే విధానంలో అటెండెన్స్‌ కొనసాగిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పడు క్రమంగా అన్ని విభాగాలు, అన్ని కేటగిరీల ఉద్యోగులకు వర్తింపజేస్తోంది.

Exit mobile version