Site icon NTV Telugu

Andhra Pradesh: ఐఏఎస్‌లకూ ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్

Face Recognization

Face Recognization

Andhra Pradesh: ఏపీలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలోని సెక్రటేరియట్‌లో విధులు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారులు ఫోన్‌లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఫోన్ నుంచి సెక్రటేరియట్‌లో పని చేస్తోన్న ఐఏఎస్‌లు అటెండెన్స్ నమోదు చేస్తున్నారు.

Read Also: Kottu Satyanarayana: ఆలయాల్లో క్షురకులకు నెలకు రూ.20వేలు ఆదాయం వచ్చేలా చర్యలు

ఈ మేరకు సెక్రటేరియేట్ నుంచే విధులు నిర్వహించాలని స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ హోదాల్లోని అధికారులకు గతంలోనే సీఎం జగన్, సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. సీఎం, సీఎస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సెక్రటేరియట్ నుంచి కాకుండా హెచ్‌వోడీల నుంచి పలువురు ఐఏఎస్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఐఏఎస్‌లను గాడిలో పెట్టేందుకు టీచర్ల తరహాలోనే ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంవోలో విధులు నిర్వహించే వాళ్లు.. సీఎం కార్యాలయం నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని ఆదేశించింది. ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయకుంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. గెజిటెడ్ అధికారులకు కూడా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Exit mobile version