NTV Telugu Site icon

Extramarital Affair : భర్తకు ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే?

Mutton Biryani

Mutton Biryani

ఐదు నిమిషాల పడక సుఖం కోసం కొందరు ఆడవాళ్లు కట్టుకున్న భర్తలనే అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. ఆ సుఖం కోసం పోలీసులకు చిక్కకుండా మరీ మర్డర్లు చేస్తున్నారు.. తాజాగా ఓ భర్త భార్యకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.. తనను చంపబోయిన భార్యను ప్రియుడితో సహా ఊసలు లెక్కపెట్టించాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. భర్తకు ప్రేమగా మటన్ బిరియాని వండి ఎక్కడా అనుమానం రాకుండా నిద్ర మాత్రలు కలిపి వడ్డించింది.. ఆ తర్వాత భర్త ఇచ్చిన ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అయ్యింది..

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన విజయనగరంలో వెలుగు చూసింది.. స్థానిక కుమ్మరివీధిలో నివాసం ఉండే కోటరాజుకు భార్య శ్రీదేవి, పిల్లలు ఉన్నారు. వీరంతా బుధవారం రాత్రి వేళ రోజూలానే నిద్ర పోయేందుకు రెడీ అయ్యారు. పడుకునే ముందు భర్తకు భార్య ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే అందులో నిద్రమాత్తలు కలిపింది. భర్త నిద్రలోకి జారుకున్నాక ఎన్నాళ్ల నుంచే వివాహేతర సంబంధం నెరపతున్న ప్రియుడు చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘును ఇంటికి పిలిచింది.. అతడితో కలిసి భర్తను ఖతం చేయాలని పక్కాగా స్కెచ్ వేసింది. నిద్రమాత్రలు కూడా ప్రియుడి ద్వారా అంతకుముందే తెప్పించింది. ఇంకేముంది కోటరాజు మెడకు నైలాన్‌తాడు బిగించి చంపేందుకు ఇద్దరూ యత్నించారు..

అయితే ఆ సమయంలో భర్తకు మత్తు ఎక్కలేదు.. అతను మెలుకువ రావడంతో బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో ఇద్దరూ పారిపోయారు. వెంటనే టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కోటరాజు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వారికి బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను అనే వ్యక్తి కూడా సాయం చేసినట్లు గుర్తించి అతడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.. ఈ ఘటన తో స్థానికులు ఉలిక్కి పడ్డారు.. చూడటానికి అమాయకంగా ఉండే మహిళకు ఇలాంటి బుద్దులు ఉన్నాయా అంటూ ఆశ్చర్య పోతున్నారు.. ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు..

Show comments