ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాజధాని ప్రాంతంలో రోడ్లు వేశారు. అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్నట్టుండి మాయం అవుతున్నాయి. వేసిన రోడ్లను దొంగతనం చేస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజమని స్థానికులు చెబుతున్నారు. రాత్రిసమయంలో కొంతమంది రోడ్లను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇదంతా అధికారపార్టీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని, రాజధానిగా అమరావతి ఉండటం వారికి ఇష్టంలేదని అందుకే అలా చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇది తమపని కాదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో అమరావతి రోడ్ల దొంగతనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Read: ఆగస్టు 6న ‘మ్యాడ్’