NTV Telugu Site icon

EX MP Harsha Kumar: వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు..

Harsha

Harsha

EX MP Harsha Kumar: ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు అని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చింది.. ఆర్టికల్ 351 షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినది.. వర్గీకరణ చేయడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదు.. రాష్ట్రపతికి, పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడివి..?.. ఈ తీర్పు మోడదీ, చంద్రబాబు కలిసి అడిన కుట్ర.. సుప్రీంకోర్టు ఈ తీర్పును ఫిబ్రవరిలోనే రిజర్వ్ చేసి పెట్టింది.. రామ్ జన్మభూమి, అయోధ్య, బాబ్రీ మసీదు తీర్పులలో జరిగిన కుట్రలో వర్గీకరణ విషయంలో కూడా జరిగింది అని హర్ష కుమార్ వెల్లడించారు.

Read Also: North Korea: ఉత్తర కొరియాను ముంచెత్తిన భారీ వరదలు.. స్వయంగా రంగంలోకి దిగిన కిమ్

ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అయితే… నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను అని హర్ష కుమార్ తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా తీర్మానం చేస్తారు.. మాదిగల ఉద్యోగాలను మాలలు దోచుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు.. భవిష్యత్ కార్యాచరణపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో రాజమండ్రిలో సభ ఏర్పాటు చేస్తాను అని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పేర్కోన్నారు.

Show comments