NTV Telugu Site icon

Anil Kumar Yadav: మంత్రి పదవి నుంచి తొలగించి సీఎం మంచే చేశారు.. మాజీ మంత్రి అనిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో మంత్రి పదవి పొందిన అనిల్‌ కుమార్‌ యాదవ్.. వైఎస్‌ జగన్‌ రెండో కేబినెట్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.. సీఎం జగన్‌ ముందుగా ప్రకటించిన ప్రకారమే.. మంత్రులను మార్చేశారు.. అయితే, తనను మంత్రి పదవి నుంచి తొలగించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మంచి చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదవి పోయిన తర్వాత సాయంత్రమే కొందరు నన్ను వీడారని.. కొంత కాలం తర్వాత మరికొందరు వదిలి పెట్టారన్నారు. ఈ పరిణామంతో సొంతం ఎవరు అనే విషయం తనకు తెలిసిందన్నారు. గతంలో మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు నన్ను వీడినా.. 2019 ఎన్నికల్లో 8 మంది కార్పొరేటర్లు తన వెంటవున్నా తాను గెలుపొందనని గుర్తుచేసుకున్నారు అనిల్..

Read Also: Students: విద్యార్థుల అవస్థలు.. గుర్రం ఎక్కితేనే స్కూల్‌కు..

2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్ తోపాటు పలువురు కార్పొరేటర్లు నన్ను విడిచిపెట్టారు.. 2019లో కేవలం 8 మంది కార్పొరేటర్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్న మాజీ మంత్రి అనిల్.. ఇప్పుడు ఎందుకు నన్ను వీడారో నాకు అర్థం కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. నాకు అనిల్ అన్యాయం చేశాడా అని ఒకసారి ప్రశ్నించుకోవాలని సూచించిన ఆయన.. నా ప్రత్యర్థి 180 కోట్లు ఖర్చు పెట్టినా నేనే గెలిచా.. ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ వంద కోట్లు పై బడిన వారున్నారు.. వేదిక మీద అంతా వెయిట్ ఉన్నవాళ్లు వున్నారు. నాకు వెయిట్ లేదని నన్ను పిలవలేదేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు.. నా రాజకీయ జీవితంలో వెన్ను పోట్లు కొత్త కాదన్న ఆయన.. రాజకీయ జీవితంలో కొంత మంది కలుస్తారు.. కొంత మంది వెళ్తారన్నారు.. ఇక, వచ్చే ఎన్నికలు అనిల్ కు చాలా కష్టం అంటున్నారు. కానీ, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు.. ప్రజలే నా వెంట ఉన్నారని చెప్పుకొచ్చారు అనిల్‌ కుమార్‌ యాదవ్.. అయితే, ఇటీవల పలువురు అనిల్ కుమార్‌ యాదవ్‌ను వీడుతున్న తరుణంలో ఈ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చగా మారాయి.

Show comments