Site icon NTV Telugu

పోలీస్ అధికారులు సిగ్గు పడాలి… నేను సిగ్గు పడుతున్నా

రమ్య మరణం పట్ల సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఇంతటి అరాచకం నా రాజకీయం లో చూడలేదు అని మాజీ మంత్రి ఆలపాటి రాజ అన్నారు. ఒక విద్యార్థిని హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ పై కేసులా… పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేసులు పెట్టిన తీరు కేసుల్లో చెప్పిన సమయానికి పొంతన లేదు. పోలీస్ అధికారులు నిస్పక్ష పాతం గా వ్యవహరించాలి. పోలీస్ లు రక్షకులు గా కాదు భక్షకులు గా మారి పోయారా అన్న అనుమానం వస్తుంది… ప్రభుత్వ మోచేతి నీళ్ళు తాగి పోలీస్ లు పని చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేత బాధితులను పరామర్శిస్తూ ఉంటే వైసిపి నాయకులను మా మీద ఉసి గొల్పింది పోలీస్ లు కాదా? టిడిపి నాయకులు భాడిత కుటుంభం వద్ద ఉంటే వైసిపి నేతలను ఎలా అనుమతించారు. పోలీస్ అధికారులు సిగ్గు పడాలి. పోలిస్ అధికారుల తీరు చూసి నేను సిగ్గు పడుతున్నా. ఇంత కిరాతక పరిస్తితి ఎప్పుడు చూడలేదు అని పేర్కొన్నారు.

Exit mobile version