NTV Telugu Site icon

సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

Phillip Tocher

వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన ఆంగ్లో ఇండియన్‌ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి. తోచర్‌… సీఎం చేతుల మీదుగా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.. ఇక‌, ఈ కార్య‌క్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు.. కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో టీడీపీకి రాజీనామా చేశారు ఫిలిప్‌ సి. తోచర్‌… క్రైస్తవ మతం పట్ల చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టుగా టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు లేఖ పంపారు.. ఇక‌, ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుంద‌ని.. రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారంటూ ఆయ‌న గ‌తంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీకి జ‌న‌వ‌రిలో రాజీనామా చేసిన ఆయ‌న‌.. ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.