NTV Telugu Site icon

ఎర్ర గంగి రెడ్డికి సీబీఐ షాక్‌.. బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా వివేకానంద డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

సీబీఐ పిటిషన్‌ పై విచారణ చేసిన కడప కోర్టు.. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. వివేకానంద డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇచ్చిన తరువాత సీబీఐ ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రాధన్యత సంతరించుకుంది.