Site icon NTV Telugu

Cell Phone Down Day: ఉద్యోగుల ఉద్యమం.. రేపు సెల్‌ఫోన్‌ డౌన్‌..

Cell Phone Down Day

Cell Phone Down Day

Cell Phone Down Day: తమ డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. అందులో భాగంగా రేపు సెల్ ఫోన్‌ డౌన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఏపీజేఏసీ రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈనెల 11న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

Read Also: NTR: అబ్బబ్బ.. ఎంత ముద్దుగా ఉన్నాడు సార్.. దిష్టి తగేలేనేమో

ఇక, సోమవారం మలి దశ ఉద్యమ కార్యచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాకలెక్టర్ కార్యాలయాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాం.. ఫిబ్రవరి 13వ తేదీన 50 పేజీలతో సీఎస్‌కి ఇచ్చిన మెమోరాండం కాఫీలను అందరికలెక్టర్లకు స్పందన కార్యక్రమాలద్వారా ఇస్తూ ఉద్యోగులలో ఉన్న ఆవేదనలు ప్రభుత్వం దృష్టికీ తీసుకొని వెళ్లమని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ 26 జిల్లాలో యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు మెమోరాండాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు అనగా ఈనెల 11వ తేదీన సెల్ డౌన్ కార్యక్రమం.. ఈనెల 12వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు.

Exit mobile version