Site icon NTV Telugu

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీ.. నిందితుడి అరెస్ట్

Tirumala Min

Tirumala Min

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు

మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి హుండీల లెక్కింపులో కొందరు చేతివాటం చూపించారు. మహామండపం బాత్‌రూమ్‌లో 12 తులాల బంగారాన్ని మంగళవారం నాడు ఆలయ సిబ్బంది గుర్తించారు. సోమవారం చేపట్టిన హుండీల లెక్కింపులో పాల్గొన్న ఉద్యోగులే ఈ బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఆలయ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీంతో ఈ చోరీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh: సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్

 

Exit mobile version