NTV Telugu Site icon

Doctors Negligence: డాక్టర్ లేకుండా ప్రసవం చేసిన ఆసుపత్రి యాజమాన్యం.. తల్లి బిడ్డ మృతి

Sai Hospital

Sai Hospital

Doctors Negligence: ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో గల సాయి స్ఫూర్తి హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్యానికి తల్లి, బిడ్డ మృతి చెందింది. పురిటి నెప్పులతో ఈ నెల 26వ తేదీ రాత్రి సాయి స్ఫూర్తి హాస్పిటల్ లో జాయిన్ అయినా వెంకటాపురం గ్రామానికి చెందిన కోడూరి పరిమళ కిరణ్ అనే గర్భవతి. అర్థరాత్రి ప్రసవం చేయటంతో పురిట్లోనే బిడ్డ మరణించింది. సాయి స్ఫూర్తి హాస్పిటల్ లో డాక్టర్ లేకుండానే ప్రసవం చేశారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో.. సాయి స్ఫూర్తి హాస్పిటల్ లో తనిఖీ చేశారు.

Read Also:Ragi: ఈ సమస్యలు ఉన్న వారికి రాగులు వరం లాంటిది.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో

ఇక, చింతలపూడిలోని సాయి స్పూర్తి హస్పటల్ దగ్గర మృతదేహంతో వెంకాటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తక్షణమే హస్పటల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. ఆసుపత్రిపై దాడికి ప్రయత్నించిన మృతురాలి బంధువులు.. ఆసుపత్రి దగ్గర స్వల్ప ఉద్రిక్తత కొనసాగింది. హస్పటల్ బయట ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.