NTV Telugu Site icon

Eluru: శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి.. తమ్మిలేరులో ఇద్దరు గల్లంతు

Swimming

Swimming

ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Mamata Banerjee: హిందూ పండగకు సెలవు రద్దు, రంజాన్‌కి కేటాయింపు.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లా తాడిపూడి వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే.. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయారు. కాగా.. ఆ ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదట.. తిరుమల శెట్టి పవన్ (17), పడాల దుర్గాప్రసాద్( 19 ), పడాల సాయి( 19) మృతదేహాలు లభ్యం కాగా.. అనంతరం అనిసెట్టి పవన్ ( 19 ), గర్రె ఆకాష్ ( 19 )ల మృతదేహాలు దొరికాయి. కాగా.. పండగ పూట తమ పిల్లల మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తాడిపూడిలో ఒకే వీధికి చెందిన వీరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: AP Politics: మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు