NTV Telugu Site icon

Borugadda Anil: రెస్టారెంట్‌కు రిమాండ్‌ ఖైదీ.. ఏడుగురు పోలీసులపై వేటు

Borugadda Anil

Borugadda Anil

Borugadda Anil: విధుల్లో నిర్లక్ష్యం వహించిన గుంటూరు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి.. రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల విందు భోజనం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోన్న విషయం విదితమే.. బోరుగడ్డ అనిల్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు తరలించే క్రమంలో.. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‍ను డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‍కు తీసుకెళ్లారు పోలీసులు… అయితే, ఆ వీడియోలో కాస్తా వైరల్‌గా మారాయి.. పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. ఇప్పటికే కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో.. ఇది తెరపైకి వచ్చింది.. దీంతో సీరియస్ గా స్పందించి సస్పెన్షన్ వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు అధికారులు.

Read Also: IPL Auction 2025: ఆర్‌సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కాగా, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచ మర్యాదలు అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌లో విందు భోజనం అంటూ పోలీసులపై విమర్శలు వెల్లివెత్తాయి.. ఇక, టీడీపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో ఈ వ్యవహారాన్ని వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు.. ఈ వ్యవహారం అంతా వివాదాస్పదం కావడంతో.. పోలీసులపై వేటు పడింది.

Show comments