Pregnant Woman in Doli: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఇంకా కొన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా కుక్కునూరు ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు ఏజెన్సీ గ్రామాలకు.. కుక్కునూరు మండలం జిన్నలగూడెం ఏజెన్సీ గ్రామంలో ఇరుమమ్మ అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది.. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఇరుమమ్మ ను మంచానికి డోలి కట్టి మూడు కిలోమీటర్లు అర్ధ రాత్రి సమయంలో.. అది కూడా ఓవైపు భారీ వర్షం పడుతోన్న సమయంలో మోసుకెళ్లారు బంధువులు..
Read Also: Kurnool Bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
అయితే, సదరు గర్భిణికి పురిటినొప్పులు అధికం కావడంతో.. మార్గ మధ్యలోనే ప్రసవించింది.. ఏజెన్సీ గ్రామానికి రహదారి లేకపోవడంతో డోలిపై గర్భిణీ స్త్రీని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలని.. డోలీలో రోడ్డు వరకు చేరుకున్న తర్వాత.. ఆటోలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువులు… ప్రభుత్వాలు మారిన ఏజెన్సీ గ్రామాల్లో డోలి కష్టాలు తీరడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాగా, ఘతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.. డోలీ కష్టాలతో సరైన సమయానికి వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు..
