Eluru Police: గుట్టు చప్పుడు కాకుండా అందినకాడికి దండుకొని ఎంజాయ్ చేసే దొంగలు ఉన్నారు.. అయితే, ఏ దొంగ అయినా.. ఇప్పుడు కాకపోతే.. కొంత కాలానికైనా దొరకకుండా తప్పించుకోలేడు.. మరికొందరైతే పోలీసులకే సవాల్ విసిరే వాళ్లు ఉన్నారు.. తాజాగా, పోలీసులకు సవాల్ విసిరిన ఓ దొంగను పట్టుకుని.. చుక్కలు చూపించారు పోలీసులు.. బైక్ చోరీలకు పాల్పడడమే కాదు.. చోరీ చేసిన బైకులను అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ.. 100 బైకులు చోరీ చేశా.. తనపై రెండు కేసులు ఉన్నాయి.. ఏం చేస్తారో చేయండి అంటూ మద్యం మత్తులో పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ..
Read Also: Rajiv Swagruha Plots : వేలం రేస్ మొదలైంది.. మీ కలల స్థలం దక్కించుకోండి.!
అయితే, దొంగ మాట్లాడిన మాటలను ఏలూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వీడియో వైరల్ అయిన కొద్ది రోజుల్లోనే ఏం చేస్తారో చేయండి అంటూ మాట్లాడిన బైక్ దొంగ దలాయి గణేష్ తో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్న మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి తొమ్మిది లక్షల విలువ చేసే పన్నెండు బైక్‌లను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులకు సవాల్ విసిరిన దొంగను మీడియా ముందు ఉంచి గతంలో చెప్పిన డైలాగులు చెప్పాలంటూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిషోర్ అడగడం ఆసక్తికరంగా మారింది..
