Site icon NTV Telugu

Jogi Ramesh Cases: జోగి రమేష్‌కు వరుస షాక్‌లు..! మరిన్ని కేసులు నమోదు రంగం సిద్ధం..

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh Cases: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది.. ఓవైపు మద్యం కుంభకోణం కేసుపై విచారణ సాగుతోన్న సమయంలో.. నకిలీ లిక్కర్‌ తయారీ కేసు రచ్చగా మారింది.. అయితే, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉండగా.. జోగి రమేష్‌పై మరిన్ని కేసులు నమోదుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై కూడా మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు నమోదు చేయనుంది సీఐడీ.. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో జోగి రమేష్‌ పాత్ర ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు సీఐడీ అధికారులు.. మరోవైపు పెడనలో కూడా భూములు క్రయ విక్రయాల్లో జోగి రమేష్‌పై పలు ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు.. వీటిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది..

Read Also: Social Media Ban: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్.. ఆ రోజు నుంచే అమలు!

కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున జోగి రమేష్‌ను సిట్, పోలీసు, ఎక్సైజ్‌ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.. కాగా, ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు వీడియోలతో జోగి రమేష్‌ను ఈ కేసులో ఇరికించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. గతంలో.. కూడా వైసీపీ నేతలను అరెస్ట్‌ చేసి.. వరుసగా కేసులు నమోదు చేసి జైలు నుంచి బయటకు రాకుండా చాలా రోజులు ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు జోగి రమేష్‌ విషయంలో కూటమి సర్కార్‌ అదే తీరుగా ముందుకు పోతుందని వైసీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు..

Exit mobile version