NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి.. నిర్వాసితులకు న్యాయం చేస్తాం..

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించినట్లుగానే జనవరిలోనే డయా ఫ్రం వాల్ పనులు మొదలుపెట్టాం.. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులుసగం పూర్తవ్వగానే, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలుపెడతాం.. గతంలో 18 నెలలు కష్టపడి చంద్రబాబు డయా ఫ్రం వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ తుగ్లక్ పాలన ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని విమర్శించారు.. పాత డయా ఫ్రంవాల్ బదులు కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం వల్ల మరో 1000 కోట్లు అదనపు భారం పడింది.. ఏడేళ్ళ క్రితం పోలవరం నిర్వాసితులకు 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే మరలా ఇప్పుడు మరో 1000 కోట్లు పరిహారం అందించారని వెల్లడించారు.

Read Also: CM Chandrababu: భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

2019 ఎన్నికల ముందు పోలవరం నిర్వాసితులకు అదనంగా 10 లక్షల పరిహారం అందిస్తానని చెప్పి.. గెలిచాక జగన్ నిర్వాసితులను మోసం చేశాడు.. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి రూ. 12159 కోట్లు తీసుకొచ్చాం అన్నారు మంత్రి నిమ్మల.. నిర్వాసితులకు న్యాయం జరిగేలా, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే, సమాంతరంగా పునరావాసకాలనీలు సైతం నిర్మిస్తాం.. పోలవరం ప్రాజెక్టు పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, గోదావరి జలాలను ఇటు ఉత్తరాంధ్ర, అంటు రాయలసీమకు తీసుకెళ్తాం.. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తాం అని స్పష్టం చేశారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.