Minister Nadendla Manohar: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ధాన్యం సొమ్మును సంబంధించిన మొత్తానికి సంబంధించిన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టింది.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పండించిన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.. రైతులను గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశాం అన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో అధికారులతో సమీక్షించిన సమయంలో అనేక అక్రమాలు బయట పడ్డాయి.. ఎన్ని కష్టాలు ఎదురైన రైతులకు బకాయిలు చెల్లించాలని నిర్ణయించుకున్నాం… గత ప్రభుత్వం చేసిన అరాచకంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.. కానీ, 674 కోట్ల రూపాయలు చెల్లింపులతో రైతుల్లో భరోసా కల్పిస్తుందన్నారు. గత ఐదేళ్లలో మీరు పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు అన్నారు.
Read Also: Paris Olympics 2024: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్!
రైతులకు పెద్ద పీట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.. కౌలు రైతులను ఆడుకోడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నిధులు ఖర్చు చేశారు.. కౌలు రైతులను ఆదుకోవాలనేది కూటమి ప్రభుత్వ నిర్ణయించిందన్నారు మంత్రి నాదెండ్ల.. గత ప్రభుత్వం గోనే సంచులు కూడా ఇవ్వలేక పోయిందని విమర్శించిన ఆయన.. 62 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.. రైతులు ఈజ్ ఆఫ్ డూయింగ్ చేయాలి.. రైతులు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు.. వచ్చే సీజన్ నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో పడతాయి.. రైతు సహాయక కేంద్రాల్లో ఈ పంట నమోదు చేసుకునే రైతులకు ఇన్స్యూరెన్స్ వర్తించేలా ఏర్పాటు చేస్తాం.. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక చర్యలు తీసుకోబోతుంది. ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్..