NTV Telugu Site icon

Pawan Kalyan: జగన్నాధపురంలో దీపం పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం..

Pawan Kalyan

Pawan Kalyan

ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపం పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదు.. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 2,684 కోట్లు, ఐదేళ్లకు13,425 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి వచ్చాను.. ఇక్కడ స్వయంబుగా వెలసిన లక్ష్మినరసింహ స్వామిని ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.

India vs New Zealand: తిప్పేసిన స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 235 ఆలౌట్

లక్ష్మీ నరసింహస్వామి 14 ఏళ్ల పరీక్ష పెట్టాడు.. గతంలో ఎదురైనా ఓటమితో జీవితం అంధకారం అయ్యింది.. అలాంటి సమయంలో జనసైనికులతో పాటు ధైర్యం ఇచ్చింది లక్ష్మీనరసింహస్వామి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీపం పథకం కేవలం వంటింట్లో వెలగడానికే కాదు.. పేదల ఆకలి తీర్చడానికి అని తెలిపారు. ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేస్తాం.. హామీలు అమలు చేయకపోతే జనసైనికుల ప్రేమ ఎంత బలంగా ఉంటుందో కోపం కూడా అంతే బలంగా ఉంటుందని చెప్పారు. పదవి వచ్చాక పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని అని అన్నారు. అభిమానులు సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుంది.. సినిమాలో ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని అన్నారు.

Ponnam Prabhakar : బీసీ కులగణనపై ప్రజలందరూ సహకరించాలి

వైసీపీపై ఫైర్..
వైసీపీ చేసిన తప్పుడు విధానాల వల్ల వ్యవస్థ పాడయింది.. వైసీపీ ఓడి 11 సీట్లు మిగిలిన వాళ్ళ నోళ్లు మూతపడటం లేదు.. లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్న భవిష్యత్తులో వైసీపీ వాళ్ల నోటి నుంచి ఇంకేమీ రాకుండా చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని అన్నారు. వైసీపీ వాళ్ళకి ఉద్యమే కావాలంటే యుద్ధమే ఇస్తాం.. గొడవే కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని పేర్కొన్నారు. ఆడపిల్లల మాన, ప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ సూచించారు. తాము ఎవరికీ అన్యాయంగా ఎదురు తిరగలేదు.. ఆడబిడ్డల గురించి, ఇంటి ఆడపడుచుల గురించి అసభ్యంగా మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.