CM Chandrababu: రాబోయే 15 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి… నాది, పవన్ కల్యాణ్ ది అదే ఆకాంక్ష.. అభివృద్ధి జరగాలి అంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక ప్రొగ్రామ్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు.. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు.. ఒక మార్పు రావాలన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: China: ప్రపంచ మార్కెట్‌లో చైనాపై చిన్న చూపు.. అమ్ముడుపోని డ్రాగన్ ఆయుధాలు
సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్ చేసిన ఘనతగా NDA ప్రభుత్వానిది.. పెన్షన్ల కోసం మన రాష్ట్రం ఖర్చు చేసినంత దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయడం లేదు.. ఏడాదికి 33 వేల కోట్లు పెన్షన్ రూపంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.. పెన్షన్లలో 59శాతం మహిళలకే అందుతుందన్నారు సీఎం చంద్రబాబు.. రైతు నష్టపోకుండా ఉండేందుకు నీరు, కరెంట్, ఎరువులు సంవృద్ధిగా ఉండేలా చూస్తున్నాం.. పోలవరం నుంచి వచ్చే నీటిని సమృద్ధిగా ఉపయోగించే ఏర్పాటు చేస్తాం.. తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం అన్నారు.. ఇటీవల డయాబెటిస్ తో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాటులలో మార్పులు వస్తున్నాయి.. రైస్ తినడం తగ్గిస్తున్నారు.. డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తాం అన్నారు.. మత వివక్షలు తగ్గాయని, ప్రజల భద్రతను మరియు అభివృద్ధిని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
