NTV Telugu Site icon

Mukesh Kumar Meena: ఆ ప్రచారం తప్పు.. ఓటర్ల తొలగింపుపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు

Mukesh Kumar Meena

Mukesh Kumar Meena

Election Commission CEO Mukesh Kumar Meena On AP Votes: పెద్ద ఎత్తున ఓట్లు తీసేసారని చేస్తున్న ప్రచారం తప్పు అని ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. తాము డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగించామని, ఎక్కడా ఓటర్లను తొలగించలేదని క్లారిటీ ఇచ్చారు. ఓటర్ల తొలగింపుపై తమకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక ప్రచారం చేశామని అన్నారు. ఓటర్ల జాబితాలను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి తనిఖీ చేస్తామన్నారు. అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామని.. తర్వాత వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తామని వెల్లడించారు.

CM YS Jagan: ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష.. పోలవరం త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

2024 ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్న ముఖేష్ కుమార్.. ఓటర్ల జాబితాలో తప్పులు ఏమైనా ఉంటే, ఇంటింటి తనిఖీలలో సరి చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోవచ్చని, వాళ్ళు కూడా ఇంటింటి తనిఖీలకు వెళ్లొచ్చని చెప్పారు. పోలింగ్ స్టేషన్ మార్పులు, చేర్పులు కూడా చేస్తామన్నారు. ప్రతి 1000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని.. కానీ మన రాష్ట్రంలో కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఓటు లేని వారు ఇప్పుడు ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. పారదర్శకంగా ఓటర్ల నమోదు, జాబితాలను సిద్ధం చేస్తామన్నారు. కొత్త యువత ఓటర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో యువ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారన్నారు. మన రాష్ట్రంలో ఎప్పుడూ 1.5 శాతం ఓట్లు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు.

Adipurush: రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!

పీఎస్ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా 10.20 లక్షల మంది డబుల్ ఓటర్లను తాము గుర్తించామన్న ముఖేష్ కుమార్.. ఒకే డోర్ నెంబర్‌పై ఎక్కువ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. 1.62 కోట్ల హౌస్ నంబర్స్‌లో ఓటర్లున్నారని.. కేవలం 6 డోర్ నంబర్లలో మాత్రమే 500 కంటే ఎక్కువ ఓటర్లు నమోదయ్యాయని అన్నారు. 2100 డోర్ నంబర్‌లలో 50 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయన్న ఆయన.. వాటన్నింటిని తనిఖీ చేస్తామన్నారు. విజయవాడలో వీధి పేరు రాసి 500 ఓట్లు ఇచ్చారని.. విజయవాడ సెంట్రల్‌లో 550 ఓట్లు 2018 ముందు నుంచి నమోదై ఉన్నాయని చెప్పారు. ఇవి ఇప్పుడు జరిగినవి కావని, గతంలో జరిగినవి క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్‌లో భాగం కాదని మరోసారి స్పష్టతనిచ్చారు.

Show comments