NTV Telugu Site icon

Tirumala: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన టీటీడీ

కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శుభవార్త చెప్పింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు… శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read Also: No-Confidence Motion: ఇమ్రాన్‌ ఖాన్‌పై సభలో అవిశ్వాస తీర్మానం..