NTV Telugu Site icon

Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు

Papikondalu Tour

Papikondalu Tour

Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర టూరిస్టులను ఎంతగానో కట్టిపడేస్తుంది.. ఈ ప్రదేశాన్ని శ్రీరాముడు మరియు సీతాదేవి వనవాస సమయంలో సందర్శించారని నమ్ముతారు. కొండలు, లోయ మరియు జలపాతాల వీక్షణను ఆస్వాదించడమే కాకుండా, పర్యాటకులు క్యాంపింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలతో ఈ టూరు ఎంతో అనుభూతిని కలిగిస్తుంది.. అయితే, గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటు.. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి వచ్చాయి.

Read Also: IND vs NZ: రెండో ఇన్సింగ్స్లో న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

దేవీపట్నం మండలం గండి పోశమ్మ ఆలయం వద్ద ఉన్నర బోటింగ్ పాయింట్ నుంచి ఇవాళ ఒక టూరిస్ట్ బోట్ పర్యాటకులను తీసుకుని పాపికొండల పర్యటనకు బయల్దేరింది.. ప్రకృతి సోయగాలు కనువిందు చేసే పాపికొండలు వద్దకు తీసుకు వెళ్లేందుకు రాజమండ్రి నుంచి పెద్దలకు 1250 రూపాయలు… పదేళ్లలోపు చిన్నారులకు వెయ్యి రూపాయలు టికెట్ గా ఖరారు చేశారు. రాజమండ్రిలోని పర్యాటకశాఖ కార్యాలయం నుంచి ఉదయం 7:30 కు వాహనంలో గండి పోశమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్తారు. ఉదయం 9 గంటలకు గోదావరిలో పర్యాటకుల బోటు ప్రారంభమై సాయంత్రం ఐదున్నరకు తిరిగి చేరుకుంటుంది. సుమారు 75 కిలోమీటర్ల మేర గోదావరిలో ప్రయాణం సాగనుంది. నిన్న పర్యాటక బోట్లకు ట్రైల్ రన్ నిర్వహించారు‌‌. అనుకోని ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. బోటు సిబ్బందికి శిక్షణ ఇచ్చిన విషయం విదితమే..