NTV Telugu Site icon

Gas Leak: గోదావరిలో పైపులైన్‌ నుండి గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు

Gas

Gas

Gas Leak: గోదావరిలో పైపులైను నుండి గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది.. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ప్రాంతంలో గోదావరిలో చమురు సంస్థలు వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకవడంతో కలకలం రేగింది.. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దరియాల తిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకు కావడంతో.. గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలు వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చింది.. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.. గ్యాస్ వాసన విపరీతంగా వస్తూండడంతో మంటలు చెలరేగే అవకాశం ఉందంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.. చమురు కంపెనీ ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మత్సకారులు కోరుతున్నారు.. కాగా, గోదావరి జిల్లాల్లో ఓఎన్‌జీసీ పైపు లైన్ల నుంచి గ్యాస్‌ లీక్‌లు గతంలోనూ చెలరేగాయి.. ఇక, కొన్నిసార్లు మంటలు కూడా చెలరేగి భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం విదితమే..

Read Also: Tirumala Laddu controversy: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..