ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహా సభలలో భాగంగా రెండవరోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో ఈయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
Alaska Airlines Boeing 737 MAX: 16 వేల అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం డోర్..
ఈ సందర్బంగా డా.హరిబాబు మాట్లాడుతూ.. మన దేశంలో దాదాపు 14వందల భాషలు ఉన్నాయని, అందులో 230 భాషలు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తెగలకు సంబందించిన భాషలున్నాయని ఆయన చెప్పారు. అయితే సుందరమైన భాష తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వ్యాఖ్యానిస్తే, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష దేవరాయలు అన్నారని, ఇక ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే నానుడి తెలుగు భాషకు ఉందని గుర్తుచేశారు. అవధాన ప్రక్రియ మహత్తర తెలుగు భాష సొంతమన్నారు. తెలుగు ప్రాచీన భాషగా కూడా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు.
RC 16: అన్నట్టే రెహమాన్ ను దింపారు… ఇక రచ్చ రచ్చే!
కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయుల కీర్తనలు , పింగళి, ఆరుద్ర , త్రిపురనేని వంటి కవుల రచనలు తెలుగు భాషకు వన్నె తెచ్చాయన్నారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి, మధునాపంతుల, శ్రీపాద, బోయి భీమన్న వంటి మహనీయులు తెలుగుజాతిలో చిరస్మరణీయులని డా.హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నో నదులు తెలుగు నేలపైనే ప్రవహిస్తున్నాయని వివరించారు. ఇందులో కాటన్ మహాశయుని కారణంగా గోదావరి నది జలాలు సస్య శ్యామలం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు చూస్తే తెలుగు బలహీన పడుతోందన్న భయం, మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయని డా. హరిబాబు పేర్కొన్నారు.