NTV Telugu Site icon

Korukonda Temple: ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం..

Korukonda

Korukonda

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవస్థానం కార్యాలయంలో తాగిన మద్యం బాటిల్స్, తిని పాడేసిన బిర్యానీ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆలయ సిబ్బంది నిర్వాహకంగా అనుమానిస్తున్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది చేసిన నిర్వాహకంతో ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు చూసి నివ్వెరపోయారు. దీంతో.. ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఘటన ఇక్కడ జరిగింది కాదంటూ సిబ్బంది బుకాయించారు. దీనిపై ఆలయ అర్చకులు కూడా నోరు విప్పలేదు.

Read Also: Education Minister: ‘‘కొంతమంది విద్యార్థులు లవ్ ఎఫైర్స్ వల్ల మరణిస్తున్నారు’’.. కోట సూసైడ్‌‌పై వ్యాఖ్యలు..

ఈ ఘటనతో అన్నవరం దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు. ఎండోమెంట్ ఉన్నత అధికారులతో దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఇలాంటి ఘటనలు జరగడంపై అపచారం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. దేవస్థానం కార్యాలయంలో మందు బాటిల్స్ వ్యవహారంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ స్పందించారు. దేవాలయ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు, ఎండోమెంట్ అధికారులతో దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలయాలను అపవిత్రం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి వాటికి విరుద్ధమని అన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో సీసీ పుటేజ్, పలు కోణాల్లో విచారణ చేపట్టి నివేదికను ఉన్నతధికారులకు అందజేస్తామని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరావు వెల్లడించారు.

Read Also: Maha Kumbh Mela: మహా కుంభమేళలో సిలిండర్ పేలుడు.. భారీ అగ్నిప్రమాదం..