NTV Telugu Site icon

Minister Kandula Durgesh: టూరిజానికి పెద్దపీట.. ఈ ప్రాంతాలపై ఫోకస్‌..

Kandula Durgesh

Kandula Durgesh

Minister Kandula Durgesh: ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నాం.. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం అన్నారు.. ఇప్పటికే ఎంట్రీ లను ఆహ్వానిస్తున్నాం అన్నారు.. కేంద్రం కూడా ఏపీ టూరిజానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.. దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి వచ్చాను అన్నారు.. అక్టోబర్ 15న కేంద్రానికి టూరిజం డెవలప్‌మెంట్‌కు నివేదిక అందిస్తాం.. 250 కోట్లు కేటాయించడానికి కేంద్రం ముందుకు వచ్చింది.. శ్రీశైలం టెంపుల్ టూరిజం అభివృద్ది చేస్తాం.. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు తెస్తున్నాం.. పట్లలో బీచ్ డెవలప్‌మెంట్‌ చేయబోతున్నాం.. సంగమేశ్వర ప్రాజెక్టును టూరిజం కారిడార్ గా చేస్తాం.. ఎకో టూరిజం ఇందులో ప్రాధాన్యం ఇస్తాం.. పర్యాటకులు టూరిజం కేంద్రాల్లో మూడు, నాలుగు రోజులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మౌలిక వసతులు పెంచుతున్నాం అన్నారు.

Read Also: Painkillers Effects: పెయిన్ కిల్లర్స్ ను తెగ వాడేస్తున్నారా.? ఈ ఇబ్బందులు తప్పవు సుమీ..

గత ప్రభుత్వం కేవలం ఆరోపణకు విమర్శలకు తప్ప టూరిజం అభివృద్ధి చేయలేదు అన్నారు మంత్రి దుర్గేష్.. అరకు, లంబసింగి, బొర్రకవేస్ లను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.. అలాగే వాటర్ బేస్డ్ ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ది చేస్తాం.. కేంద్రంలోని ప్రసాద పథకంలో 25 కోట్లతో అన్నవరం దేవస్థానం అభివృద్ది టెంపుల్ టూరిజంలో చేస్తాం అన్నారు.. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం.. టెంపుల్ టూరిజం ఆలయాల సర్క్యూట్ లో పెట్టి ప్రత్యేకమైన ఫ్యాకేజ్ తో ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తాం.. 15 హరిత టూరిజం కేంద్రాలను మెరుగుపరుస్తాం.. ప్రకృతి వైపరీత్యం వల్ల విజయవాడ కృష్ణా తీరంలో బెర్మ్ పార్కు దెబ్బతింది. 12 కోట్లు నష్టం టూరిజంకు వచ్చింది. వర్షాలు, వరదలు వల్ల టూరిజం బాగా దెబ్బతిన్నట్టు వెల్లడించారు..

Read Also: Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..

ఇక, నాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం.. నిర్మాతలు ఒక లేఖ రాస్తే, వారు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అందుకు అనుగుణంగా సింగిల్ విండో విధానంలో అన్నీ అనుమతులు ఇస్తామని చెప్పాం అన్నారు మంత్రి కందుల.. త్వరలోనే సినీ నిర్మాతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసి వారి సమస్యలపై చర్చించనున్నారు.. నంది నాటక ఉత్సవాలు నంది అవార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. ఇప్పటికే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం అన్నారు. పిచ్చికులంక అభివృద్ధికి ఓబరేయ్ సంస్థ ముందుకు వస్తుంది.. ప్రతిపాదనలుపై చర్చలు జరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలను కలుపుకొని ఆఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది . కడియం నర్సరీ ఆధారంగా టూరిజం ప్రాంతం అభివృద్ధి చేస్తాం.. ప్రధాన పంటకాలవలో టూరిజం బోటు ఏర్పాటు చేస్తున్నాం.. రాజమండ్రి వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరణ అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్‌..