NTV Telugu Site icon

Margani Bharat: గడిచిన నాలుగైదు రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుంది

Bharath

Bharath

Margani Bharat: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి గడిచిన నాలుగైదు రోజులుగా అట్టుడికి పోతుందని మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆరోపించారు. మహిళలపై వేధింపులు మానభంగాలు జరుగుతున్నాయి.. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్విట్ చేయటం దారుణం.. పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారు అని ప్రశ్నించారు. ఇది బాధ్యతారహిత్యం కాదా.. క్రైస్తవ సంఘాలు ఇది హత్య అని ఘోషిస్తున్నాయి.. అలాగే, ఫార్మసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించింది.. బొల్లినేని కిమ్స్ ఎంజీఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్ గా ఉంది.. అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తామని మార్గాని భరత్ పేర్కొన్నారు.

Read Also: Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. సందిగ్ధంలో బీజేపీ

ఇక, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఇష్యుని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది.. అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారు.. తన అవయవాలు దానం చేయాలని, తాను మళ్ళీ పుట్టాలనుకోవడం లేదని సూసైడ్ నోట్ లో బాధితురాలు రాసింది.. నిందితుడు దీపక్ దీన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశాడు.. ఆస్పత్రిలో సీసీ టీవీ రికార్డులను పూర్తిగా బయట పెట్టండి అని డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం.. ఈనెల 23న రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ఎఫ్ఐఆర్ డేట్ ను ఎందుకు మార్చారు.. ఇది అనేక అనుమానాలు తావిస్తుంది అని మార్గాని భరత్ రామ్ తెలిపారు.

Read Also: Amit Shah: లోక్‌సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు

అయితే, హాస్పిటల్ మేనేజ్మెంట్ ను ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అని మార్గాని భరత్‌రామ్‌ ప్రశ్నించారు. యువతి సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్ అబ్ స్కాండ్ అయ్యాడు.. దీపక్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, అతని మామ రాజమండ్రిలో క్రియాశీలక నాయకుడు అని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందినవారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుంది.. ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదు.. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక అబద్ధాలు చెబుతున్నారు.. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని వైసీపీ నేత మార్గాని భరత్ చెప్పుకొచ్చారు.